
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు
మహబూబాబాద్ అర్బన్: నవ రాత్రులు భక్తుల పూజలందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మానుకోట పట్టణంలోని నిజాం చెరువులో శుక్రవారం జరిగే గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు. పట్టణంలోని మదర్‌థెరిస్సా సెంటర్‌లో గణనాథులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఆహ్వాన వేదిక ఏర్పాటు చేశారు. పట్టణ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు ముందస్తు ప్రణాళిక చేశారు. ఈమేరకు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. కాగా, చెరువు వద్ద భారీ క్రేన్లు, గజఈత గాళ్లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. మున్సిపల్ పరిధిలోని వీలిన గ్రామాల్లో సూచించిన చెరువుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, తదితర శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు.
నేడు గణేశ్ నిమజ్జన వేడుకలు
అందుబాటులో క్రేన్లు,
గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు
జిల్లా కేంద్రంలో రూట్‌మ్యాప్ సిద్ధం చేసిన పోలీసుశాఖ

వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు