
మధ్యవర్తిత్వం అద్భుతమైన పరిష్కార వేదిక
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : మధ్యవర్తిత్వం అనేది అద్భుతమైన పరిష్కార వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల మీడియేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో మీడియేషన్ ప్రాముఖ్యతను తెలియజేసే బోర్డును గురువారం ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతుల్లో మధ్యవర్తిత్వం ఒకటన్నారు. మధ్యవర్తులు వివాదాన్ని పరిష్కరించే విషయంలో నిర్ణయం తీసుకోరని, పార్టీలకు మార్గనిర్దేశం చేస్తారన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ్, జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమ్‌చందర్, సభ్యులు, మధ్యవర్తులుగా శిక్షణ పొందిన 8 మంది న్యాయవాదులు పాల్గొన్నారు.