
యూరియా కోసం కొట్లాట
మహబూబాబాద్ రూరల్ : మానుకోట పట్టణంలోని వివేకానంద సెంటర్‌లో గురువారం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం క్యూలో తోపులాట జరిగింది. ఈక్రమంలో మహిళలు సిగలు పట్టుకున్నారు. అలాగే యూరియా బస్తాలు పంపిణీ చేయాలంటూ మన గ్రోమోర్ సెంటర్‌పై రైతులు రాళ్లతో దాడిచేశారు. గ్రోమోర్ బోర్డును చించివేసి సెంటర్ ముందు పాత కర్రలు వేసి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. అనంతరం సెంటర్ గోదాంపై దాడిచేసి అందులోకి చొచ్చుకెళ్లారు. గోదాము తలుపులు పగులగొట్టి యూరియా బస్తాలు తీసుకెళ్తుండగా పోలీసులు భారీగా చేరుకుని అడ్డుకున్నారు.