
యూరియా బస్తాలు మాయం
కొత్తగూడ: మండలంలోని పొగుళ్లపల్లి పీఏసీఎస్‌కు సరఫరా అయిన యూరియాలో 94 బస్తాలు మా యమయ్యాయి. ఏఓ ఉదయ్, ఎస్సై రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. పీఏసీఎస్ పరిధిలోని రైతులకు బుధవారం సాయంత్రం యూరియా పంపిణీ చేశా రు. పంపిణీ నిలిపివేయాలనుకునే సమయానికి గోదాం వైపునకు రైతులు ఒక్కసారిగా పరుగులు తీ శారు. దీంతో ఎన్ని బస్తాలు నిల్వ ఉన్నాయో తనిఖీ చేయకుండా గోదాం మూసివేశారు. మరుసటి రోజు వచ్చి లెక్క చూడగా సరికి 94 బస్తాల తేడా వచ్చింది. దీంతో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధి కారులు.. హమాలీలను విచారించగా 34 మంది త మ అసరాలకు అనుగుణంగా తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో వారి నుంచి రికవరీ చేసి పంపిణీ చేశారు. కాగా, యూరియా మాయంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. యూరియా బస్తాలు ఒక నాయకుడికి ఇచ్చి హమాలీలను కారణంగా చూపుతున్నారనే చర్చ సాగుతోంది.
పొగుళ్లపల్లి పీఏసీఎస్‌లో ఘటన