
రోడ్డు ప్రమాదంలో సాక్షి డెస్క్ జర్నలిస్టుకు గాయాలు
ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో సాక్షి డెస్క్ జర్నలిస్ట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజీపేట మండలం రాంపూర్‌లో జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం.. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ రబ్బాని పాషా రాంపూర్ శివారులోని సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయంలో డెస్క్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు.ఈ సమ యంలో రాంపూర్ శివారులోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి ని చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రబ్బాని పాషా ఆరోగ్యం విషమంగా ఉందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.