
నాలుగేళ్ల తర్వాత తెరుచుకున్న బడి..
శాయంపేట: మండలంలోని కొప్పులలో నాలుగేళ్ల క్రితం మూతబడిన గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను జూన్ 30న ఎంఈఓ భిక్షపతి తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వ విద్యను బతికించే ప్రయత్నం చేయడం అభినందనీయమని, విద్యే ప్రగతికి సోపానమని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఎంఈఓ భిక్షపతి ప్రత్యేక చొరవ తీసుకుని గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తిరిగి తెరిపించారు. నాలుగేళ్లుగా మూతబడిన బడిని ఎంఈఓ భిక్షపతి ప్రత్యేక చొరవ తీసుకుని తెరిపించినందుకు మాజీ జెడ్పీటీసీ వంగాల నారాయణరెడ్డి, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.