బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది | - | Sakshi
Sakshi News home page

బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది

Sep 5 2025 11:49 AM | Updated on Sep 5 2025 11:49 AM

 బడిన

బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది

వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం ఒడ్డెరగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు టి.రాజేశ్‌కుమార్‌ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. నేడు హైదరాబాద్‌లోని శిల్పారామంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. రాజేశ్‌ బాధ్యతలు స్వీకరించిన సమయంలో స్కూల్‌లో జీరో స్టెంత్‌ ఉంది. దీంతో పాఠశాలను బాగుచేసి పిల్లలను బడిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2018లో జీరో స్టెంత్‌ స్కూల్‌ను రీఓపెన్‌ చేసి రూ.40 వేలు సొంత డబ్బులు వెచ్చించి పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించారు. సహచార ఉపాధ్యాయుడు విజయ్‌భాస్కర్‌ సాయంతో ఇంటింటికీ తిరిగి 15మంది పిల్లలను బడిలోకి తీసుకొచ్చాడు. అనంతరం పాఠశాల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు. దీంతో 2023లో జిల్లా స్థాయిలో టీచింగ్‌ లార్నింగ్‌ మెటీరీయల్‌ తయారు చేయగా జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. జూలైలో ఢిల్లీలో జరిగిన సీసీఆర్‌టీ ట్రైనింగ్‌ ప్రోగ్రాంకు తెలంగాణ నుంచి 10 మంది వెళ్లగా అందులో రాజేశ్‌ ఉన్నారు.

ఆదర్శం.. ఆ ఉపాధ్యాయుడు

గూడూరు: అతనో మారుమూల ఏజెన్సీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఎక్కడ పనిచేసినా విద్యాభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తారు. అతనే గూడూరు మండలం రాజనపల్లి మండల పరిషత్‌ ప్రాఽథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండి. యాకూబ్‌. పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచాలనుకున్న సహచర ఉపాధ్యాయుల నిర్ణయానికి యాకూబ్‌ తన అభిప్రాయం తెలిపారు. తాను సొంత డబ్బులు రూ. లక్షా 50 వేలు వెచ్చించి ఓ వ్యాన్‌ కొనుగోలు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను రోజూ పాఠశాలకు తీసుకొచ్చి సాయంత్రం ఇంటి వద్ద చేర్చుతూ తానే వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. దీంతో గతంలో ఆ పాఠశాలలో 26 మంది విద్యార్థులు ఉండగా, వ్యాన్‌ కొనుగోలు తర్వాత ఆ సంఖ్య 75కి పెరిగింది. కాగా, విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుడే డ్రైవర్‌గా మారడంపై ఉన్నతాధికారులు గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న టీచర్లు

నాణ్యతగా, వినూత్నంగా బోధిస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు

బంగారు బాటలు

 బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది1
1/3

బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది

 బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది2
2/3

బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది

 బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది3
3/3

బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement