
ఫార్మసీతో కేయూ ప్రతిష్ట విశ్వవ్యాప్తం
కేయూ క్యాంపస్ : యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్‌తో కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం యూనివర్సిటీలోని ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పరిపాలనభవనంలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 50 వసంతాల్లో ఫార్మసీ కాలేజీ స్ఫూర్తిదాయకమైన అధ్యాపకులు, విద్యార్థులను అందించిందని కొనియాడారు. ఫార్మసీలో ఇంకా మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు జరిగాలన్నారు. ఫార్మసీ కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్ విశ్రాంత ఆచార్యులు పరమేశ్వర్ మాట్లాడుతూ ఫార్మసీ కాలేజీ ఎంతోమంది గొప్ప విద్యార్థులను అందించిందని గుర్తుచేశారు. యూరో మెడికేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అఽధినేత జె. రాజమౌళి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా ఈ కళాశాలను నిలబెట్టుకున్నామన్నారు. కేయూ ఫార్మసీ అలుమ్ని వైస్ ప్రెసిడెంట్ ఏవీ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం పూర్వ విద్యార్థుల సంఘం పనిచేస్తుందన్నారు. ప్రొఫెసర్ రామ్‌బహూ మాట్లాడుతూ ఫార్మసీ రంగం ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. విశ్రాంత ఆచార్యులు ఎ.వి.ఎన్ అప్పారావు మాట్లాడుతూ ఫార్మసీ కళాశాలకు రుణపడి ఉంటామన్నారు. విశ్రాంత ఆచార్యులు మల్లారెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులను చూసి గర్విస్తున్నామన్నారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు (అకుట్) బి. వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థులు ఈ కళాశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల చైర్మన్, ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి, కన్వీనర్ గాదెసమ్మయ్య మాట్లాడారు. సాయంత్రం నిర్వహించిన ముగింపు సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి వన్నెతెచ్చి న ఫార్మసీ కాలేజీలో గొప్పపరిశోధనలకు అవకాశాలున్నాయన్నారు. ఆచార్యలు వై. నర్సింహారెడ్డి, ఎన్‌ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వీసీ కె. ప్రతాప్‌రెడ్డి
ఉత్సాహంగా ఫార్మసీ కాలేజీ
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు

ఫార్మసీతో కేయూ ప్రతిష్ట విశ్వవ్యాప్తం