
వావ్.. వాటర్ ఫాల్స్
చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. అడవి మధ్యలో ఎత్తైన గుట్టలు.. ఆ గుట్టల మధ్య ఏర్పడిన సహజసిద్ధ పాయల నుంచి పారుతున్న నీరు పాలనురగలా జాలువారుతోంది. అలుగుపై గలగలా పారుతూ పర్యాటకుల మనసును కట్టిపడేస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బొగత, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని భీమునిపాదం, ఇదే జిల్లా బయ్యారం సమీపంలోని పెద్దగుట్టపై ఉన్న పాండవుల జలపాతం ఉధృతంగా జాలువారుతున్నాయి. దీంతో ఆ అందాలను చూసేందుకు సోమవారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఆయా జలపాతాల వద్దకు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా జలపాతాల్లో స్నానం చేస్తూ కేరింతలు కొట్టారు. సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. జలపాతాల అందాలకు ఫిదా అయ్యారు. – వాజేడు/గూడూరు/బయ్యారం
పాలనురగలా జాలువారుతున్న జలపాతాలు
● పర్యాటకుల మనసు దోచుకుంటున్న బొగత, భీమునిపాదం, పాండవుల జలపాతాలు

వావ్.. వాటర్ ఫాల్స్