కాజీపేట–బల్లార్షా సెక్షన్‌లో ఎన్‌ఐ వర్క్స్‌.. | - | Sakshi
Sakshi News home page

కాజీపేట–బల్లార్షా సెక్షన్‌లో ఎన్‌ఐ వర్క్స్‌..

Sep 2 2025 7:24 AM | Updated on Sep 2 2025 7:24 AM

కాజీపేట–బల్లార్షా సెక్షన్‌లో ఎన్‌ఐ వర్క్స్‌..

కాజీపేట–బల్లార్షా సెక్షన్‌లో ఎన్‌ఐ వర్క్స్‌..

కాజీపేట రూరల్‌ : కాజీపేట–బల్లార్షా రైల్వే సెక్షన్ల మధ్య ఎన్‌ఐ పనుల(కమిషనింగ్‌ ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌)తో కాజీపేట, వరంగల్‌ మీదుగా ప్రయాణించే పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దుతో పాటు మరికొన్ని పాక్షికంగా రద్దు, కొన్ని రైళ్లకు హాల్టింగ్‌లు ఎత్తివేత, మరికొన్ని రైళ్లను రెగ్యులేషన్‌ చేసి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ సోమవారం తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

ఈ నెల 3వ తేదీన కాజీపేట–సిర్పూర్‌టౌన్‌ (17003) ప్యాసింజర్‌, బల్లార్షా–కాజీపేట (17004) ప్యాసింజర్‌, బల్లార్షా–కాజీపేట (17036) ప్యాసింజర్‌, ఈ నెల 2వ తేదీన( నేడు) కాజీపేట–బల్లార్షా (17035) ప్యాసింజర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

పాక్షికంగా రద్దయిన రైళ్లు..

ఈనెల 3వ తేదీన భద్రాచలంరోడ్‌–బల్లార్షా (17033) సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య, సిర్పూర్‌టౌన్‌–భద్రాచలంరోడ్‌ (17034) సింగరేణి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ (17234) ఇంటర్‌సిటీ ఈ నెల 2న సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–కాజీపేట మధ్య, సికింద్రాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233) ఇంటర్‌సిటీ కాజీపేట–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ మధ్య రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఉప్పల్‌, జమ్మికుంటలో

పలు రైళ్లకు హాల్టింగ్‌ ఎత్తివేత

ఈ నెల 3న హైదరాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (17011) ఇంటర్‌సిటీ, సిర్పూర్‌కాగజ్‌నగర్‌–బీదర్‌ (17012) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (12757) ఎక్స్‌ప్రెస్‌లకు జమ్మికుంట, ఉప్పల్‌ రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా హాల్టింగ్‌ ఎత్తివేసినట్లు సీపీఆర్వో తెలిపారు.

రెగ్యులేషన్‌ ట్రైన్స్‌..

ఈ నెల 3న కాజీపేట, వరంగల్‌ మీదుగా వెళ్లే శ్రీమాతవైష్ణవి దేవికాట్రా–కన్యాకుమారి (16318) ఎక్స్‌ప్రెస్‌ 90 నిమిషాలు, లక్నో–చైన్నె సెంట్రల్‌ (16094) ఎక్స్‌ప్రెస్‌ 75 నిమిషాలు, గోరఖ్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ (15023) ఎక్స్‌ప్రెస్‌ 45 నిమిషాలు, సిర్పూర్‌కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ (12758) ఎక్స్‌ప్రెస్‌ 30 నిమిషాలు, న్యూఢిల్లీ–విశాఖపట్నం (20806) ఎక్స్‌ప్రెస్‌ 20 నిమిషాల పాటు రెగ్యులేషన్‌ చేసి నడిపించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు.

3వ తేదీన పలు రైళ్లు రద్దు, కొన్ని పాక్షికంగా రద్దు

పలు ట్రైన్లకు హాల్టింగ్‌లు ఎత్తివేత, రెగ్యులేషన్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement