
సైబర్ మోసం..
● బ్యాంకు ఖాతా నుంచి రూ. 38,500 మాయం
గీసుకొండ: మండలంలోని కొనాయమాకులకు చెందిన కక్కెర్ల నిహారిక బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 38,500 మాయం చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గీసుకొండ ఇన్‌స్పెక్టర్ మహేందర్ కథనం ప్రకారం..నిహారిక ఇటీవల హనుమకొండ జిల్లా కాజీపేట వద్ద తన సెల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. ఈ విషయమై కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి పది రోజుల్లో సెల్‌ఫోన్‌ను రికవరీ చేసి ఆమెకు అప్పగించారు. ఈ మధ్యలో నిహారిక ఎస్‌బీఐ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఎనిమిది విడతలుగా రూ. 38,500ను డ్రా చేశారు. దీనిపై నిహారిక గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు.

సైబర్ మోసం..