
యూరియా పంపిణీలో నకిలీ కూపన్ల కలకలం..
యూరియా పంపిణీ చేస్తున్న షాపు నిర్వాహకులు
నర్సింహులపేట: యూరియా నకిలీ కూపన్లు కలకలం సృష్టించాయి. సోమవారం సాయంత్రం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీసాయి ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులకు 220 బస్తాలు రావడంతో కూపన్లు తీసుకున్న రైతులు షాపు వద్ద లైన్‌లో నిలుచున్నారు. కొందరు రైతులు తీసుకున్న తర్వాత 42,45 మరో నంబర్‌తో కలర్ జిరాక్స్‌తో (నకిలీ కూపన్) లారీ వద్దకు రావడంతో నిర్వాహకులు ఇంతకు ముందే ఈ నంబర్‌పై పంపిణీ చేశామని వచ్చిన వారిని పట్టుకున్నారు. యూరియా పంపిణీ త్వరగా జరగడం, రైతులు పెద్ద ఎత్తున రావడంతో రెండు నకిలీ కూపన్లతో రెండో సారి వచ్చినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సురేశ్ షాపు వద్దకు వచ్చి నకిలీ కూపన్ల నంబర్లను ఆరాతీసి నిందితులను పట్టుకుని వారి నుంచి రికవరీ చేశారు.