
ఎరుపెక్కుతున్న రైలు పట్టాలు
● వరంగల్ చింతలపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఇటీవల క్రిస్టియన్ కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
● బట్టల షాపులో పనిచేస్తున్న వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన ఓ గుమస్తా ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది హంటర్ రోడ్డులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖిలా వరంగల్/కాజీపేట రూరల్ : రైలు పట్టాలు రక్తధారలతో ఎరుపెక్కుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌దాటుతూ ప్రమాదాలకు గురికావడం.. రైలు బోగి నుంచి ప్రమాదవశాత్తు జారి పడడం, కష్టాలకు చితికి పోయి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడడం లాంటి ఘటనలతో రైలు పట్టాలపై మరణ మృదంగం మోగుతోంది. ఫలితంగా ఆనందంగా సాగుతుందనుకునే రైలు ప్రయాణం పలువురి జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. భద్రత కోసం అఽధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ప్రయాణంలో నిర్లక్ష్యం, జీవితం మీద విరక్తితో ఆత్మహత్యలకు పాల్పడడం.. ఇలా కారణం ఏమైనా తరచూ రైలు పట్టాలపై మృత్యు ఘోష వినిపిస్తూనే ఉంది. వరంగల్ రైల్వేస్టేషన్ (జీఆర్పీ ) పరిధిలో న్యూశాయంపేట రైల్వే గేట్ నుంచి మహబూబాబాద్ వరకు సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో రోజూ ఏదో ఒక చోట దుర్ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. కాజీపేట జీఆర్పీ స్టేషన్ పరిధి కాజీపేట నుంచి పెంబర్తి, కాజీపేట నుంచి ఉప్పల్, కాజీపేట నుంచి దర్గా రైల్వే గేట్ వరకు ఉంది.
ఎవరితో చెప్పుకోవాలి..
పదేళ్ల క్రితం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమ్మడి కుటుంబాలుండే వి. ఏ కష్టం వచ్చినా పంచుకునే ందుకు, భరోసా ఇచ్చేందుకు పెద్దలు ఉండేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఉరుకులు, పరుగుల జీవితంలో కనీసం భార్య, భర్తలు కుటుంబ పెద్దలతో మనసు విప్పి మాట్లాడుకునే సమయం ఎక్కడుంది. ఒంటరితనంలో మానసికంగా కృంగిపోతుండడంతో ఆత్మహత్యలకు దారి తీస్తోంది.
యువతలో అధికం..
చదువులో ఒత్తిడి.. ప్రేమలో వైఫల్యం.. మత్తుపదార్థాలకు బానిస కావడం.. కుటుంబ కలహాలు.. దీర్ఘకాలిక అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందులు.. ఒంటరి తనం.. తదితర కారణాలతో యువత ఎక్కు వ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ వ్యక్తిలోని క్షణికావే శం ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. వివాహేతర సంబంధాలు కూడా కుటుంబాల్లో గొడవలకు కారణమవుతున్నాయి. వీటి వల్ల మనస్తాపానికి గురై ప్రాణం తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిని విశ్లేషణ శక్తి కొరవడుతోంది. స్నేహితులు, పెద్దల నుంచి సరైన సలహాలు తీసుకోలేకపోవడం వల్ల తనువు చాలిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు. 22 నుంచి 25 ఏళ్లలోపు వారు 35 శాతం ఉంటున్నారు. 35 నుంచి 65 ఏళ్ల పైబడిన వారిలో ఈ ధోరణి ఎక్కువ కనిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఘటనలకు కొన్ని కారణాలు..
కదులుతున్న రైళ్లు ఎక్కడం, దిగడం, వేగంగా వెళ్తు న్న రైల్లోని గేట్ల వద్ద కూర్చుని, నిల్చొని స్వీయ చి త్రాలు, రీల్స్‌కు యత్నించడం, గేట్ల వద్ద కూర్చున్నప్పుడు నిద్రొచ్చి జారిపడపోవడం, రైలు వస్తోందని గమనించకుండా పట్టాలు దాటడం, అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో జీవి తంపై విరక్తి చెంది ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రైలు ప్రమాదాలకు గురవుతూ చనిపోతున్న పలువురు
కష్టాలకు చితికి అర్ధంతరంగా తనువు చాలిస్తున్న యువత
వెరసి ట్రాక్‌పై మోగుతున్న మరణ మృదంగం
జీవితం మీద విరక్తితో ..
జీవించి సాధించాల్సింది పోయి కష్టాలతో చితికి.. మానసిక వేదన గురై పలువురు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. వరంగల్ జీఆర్పీ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. కుటుంబాల కలహాలతో క్షణికావేశానికి గురైన వారు కొందరైతే.. ఆర్థిక కష్టాలతో మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడి నమ్ముకున్న వారికి పుట్టెడు శోకం మిగుల్చుతున్నారు.

ఎరుపెక్కుతున్న రైలు పట్టాలు