
సమస్యలకు చావే పరిష్కారం కాదు..
ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. స్నేహితుల సహకారం తీసుకోవాలి. అంతేకానీ ఆత్మహత్యకు పాల్ప డొద్దు. ఆత్మహత్యకు ముందు చాలా మంది డిప్రెషన్‌కు లోనవుతారు. ఈసమయంలో ఎవరైనా గుర్తిస్తే ఆత్మహత్య నిర్ణయం నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి భరోసా ఇచ్చేలా మాట్లాడాలి. అవసరమైతే వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
డాక్టర్ రాజు, సైకియాట్రిస్ట్, వరంగల్
అవగాహన కల్పిస్తున్నాం..
ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదమని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. రైల్వేస్టేషన్‌లో ఎక్కువ సేపు కూర్చుంటున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. రైలు పట్టాలు దాటడం, సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవడానికి జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నాం. అలాగే, సూసైడ్ స్పాట్‌లను గుర్తించి ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం.
సురేందర్, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్, వరంగల్

సమస్యలకు చావే పరిష్కారం కాదు..