
జల విలయానికి ఏడాది..
మరిపెడ రూరల్: గతేడాది ఆగస్ట్ 31 అర్ధరాత్రి, సెప్టెంబర్ 1న తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వరదలు ముంచెత్తాయి. ఫలితంగా మండలంలోని చెరువులు, కుంటలన్నీ తెగిపోయి వరద పోటెత్తింది. ఆకేరు వాగు ఉగ్రరూ పం దాల్చి పరీవాహక ప్రాంత గ్రామాలు మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లెపల్లి, సీతా రాంతండా, బాల్నిధర్మారం గ్రామాల్లోకి అర్ధరాత్రి వరద చేరుకుంది. ఆ సమయంలో ప్రజలంతా ని ద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇళ్లల్లోకి నీ రు చేరడంతో ఏమి జరుగుతుందో అర్థం కానీ ప రిస్థితుల్లో అర్థనాదాలు చేశారు. సీతారాంతండా పూ ర్తిగా జలమయమైంది. దీంతో బతుకు జీవుడా అంటూ ఇళ్లల్లో నుంచి పిల్లాపాపలతో బయటకు పరుగులు తీశారు. ఎటు చూసిన వరదనీరే. దీంతో ఇళ్ల స్లాబ్‌లు ఎక్కి బిక్కుబిక్కుమంటు తెల్లవార్లు పైనే ఉండి ప్రాణాలు రక్షించుకున్నారు. విషయం తెలు సుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ప్రత్యేక బృందాలతో ముంపు గ్రామాలకు చే రుకుని వరదల్లో చిక్కుకున్న సీతారాంతండా ప్రజ లను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ముంపు గ్రామాల్లో భారీ నష్టం..
ముంపు గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లింది. తిండి గి ంజల నుంచి దుస్తుల వరకు తడిసి ముద్దయ్యాయి. పంటలన్నీ వరదకు కొట్టుకుపోయాయి. దీంతో ఎ టుచూసినా ఇసుక దిబ్బలు తప్ప మరేమీ కనిపించలేదు. బాల్నిధర్మారం–జెల్లెపల్లి గ్రామాల మధ్య ఆకే రు వాగుపై ఉన్న బ్రిడ్జి అరకిలోమీటర్ కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్వ ని, ఆమె తండ్రి మోతీలాల్ కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద హైవే తెగిపోయి కారు కొట్టుకుపోయింది. దీంతో తండ్రి, కూతురు మృతి చెందారు.
సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం..
అధికారుల లెక్కల ప్రకారం.. సీతారాంతండాలో 49, ఉల్లెపల్లిలో 123, బాల్నిధర్మారంలో 10, తండాధర్మారంలో 10 ఇళ్లు నీట మునిగాయి. అలాగే, ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలో సుమారు వె య్యి ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అనంతరం ముంపుకు గురైన సీతారాంతండాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు, పంట నష్టం జరిగిన బాధితులకు రూ.16 వేల చొప్పున పరిహారం అందించారు. వాగు పరీవాహక గ్రామాల్లో ముంపునకు గురైన ఇళ్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వారందరికీ ఒకే చోట సామూహికంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇ స్తామని సీఎం ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని బాధితులు కన్నీరుమన్నీరవుతున్నారు.
గతేడాది అర్ధరాత్రి ముంచెత్తిన వరదలు
ఆకేరు వాగు వరద నీటిలో చిక్కుకున్న సీతారాంతండా
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
ఇంటి స్లాబ్‌లపైకి ఎక్కిన ప్రజలు
అనంతరం తండాను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
వరద బాధితులకు ఇచ్చిన
హామీ ఏడాదిగా నెరవేరని వైనం

జల విలయానికి ఏడాది..