
సర్వం కోల్పోయాం..
గతేడాది ఆకేరు వాగు వరద ధాటికి సర్వం కోల్పోయాం. వారం రోజులుగా ఇళ్లు వదిలేసి పునరావాస కేంద్రంలోనే తలదాచుకున్నాం. ఇప్పటికీ ఆ పీడకల గుర్తుకొస్తే భయంతో వణికిపోతున్నాం.
–మూడు రామన్న,
ముంపు బాధితుడు, సీతారాంతండా
కోలుకోలేక పోతున్నాం..
వరదతో సర్వం కోల్పోయిన మేము ఇంకా కోలుకోలేకపోతున్నాం. పొలాల్లో ఇసుక మేటలు పడి పంటలు పండే పరిస్థితి కానరావడం లేదు. ఇంట్లో వస్తువులన్నీ వరదకు కొట్టుకుపోవడంతో ఒక్కొక్కటిగా కొనుగోలు చేసుకుంటున్నాం
–గుగులోత్ మంగీ, ముంపు బాధితురాలు, సీతారాంతండా
వర్షం వస్తే భయం అనిపిస్తోంది..
గతేడాది ఆకేరు వాగు వరదలో చిక్కుకుని బతికి బట్టగట్టా. ప్రస్తుతం వర్షం వస్తే భయంతో వణికి పోవాల్సి వస్తుంది. నా ఇల్లు ఉల్లెపల్లిలో ఆకేరు వాగు ఒడ్డునే ఉంది. ఎప్పడు వరదలు వచ్చి ప్రాణాలు పోతాయోనని భయంగా ఉంది.
–గండ్లు శాంతమ్మ,
ముంపు బాధితురాలు, ఉల్లెపల్లి

సర్వం కోల్పోయాం..

సర్వం కోల్పోయాం..