● సెప్టెంబర్ 7 నుంచి అమలు..
కాజీపేట రూరల్ : వినాయకచవితి, దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 8 ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శనివారం తెలిపారు.
ఫెస్టివల్ ట్రైన్ల వివరాలు..
సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ప్రతీ ఆదివారం చర్లపల్లి–హజ్రత్ నిజాముద్దీన్ (07023) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు హజ్రత్‌నిజాముద్దీన్–చర్లపల్లి (07024) ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం, సెప్టెంబర్ 3 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు చర్లపల్లి–రక్సోల్ (07007) ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం, సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు రక్సోల్–చర్లపల్లి (07008) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శనివారం, సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు చర్లపల్లి–డెహ్రాడూన్ (07077) ఎక్స్‌ప్రెస్ ప్రతీ మంగళవారం, సెప్టెంబర్ 4 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు డెహ్రాడూన్–చర్లపల్లి (07078) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం, అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు చర్లపల్లి–రక్సోల్ (07051) ఎక్స్‌ప్రెస్ ప్రతీ మంగళవారం, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రక్సోల్–చర్లపల్లి (07052) ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్లనున్నట్లు రైల్వే సీపీఆర్వో తెలిపారు.
ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో అరుదైన చికిత్స
వరంగల్ చౌరస్తా : వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో శనివారం అరుదైన చికిత్స నిర్వహించారు. ఆయుర్వేద వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ తుమ్మ మధు బృందం ఆధ్వర్యంలో ‘టీనో సైను వైటీస్’ అనే వ్యాధికి ‘అగ్ని కర్మ’చికిత్స నిర్వహించారు. వరంగల్ 34 డివిజన్ శివనగర్‌కు చెందిన సత్యనారాయణ‘ట్రిగ్గర్ ఫింగర్ టీనో సైను వైటీస్’ అనే నరాల వ్యాధితో ఐదు నెలల నుంచి బాధపడుతున్నాడు. అల్లోపతి వైద్యులను సంప్రదించి ఎన్నో మందులు వాడినా ఫలితం లేదు. నరాల కదలిక ఆగిపోవడం, ఆ ప్రాంతంలో అధిక నొప్పితో సత్యనారాయణ.. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్‌లను సంప్రదించగా ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ ఖర్చుతో కూడి ఉండడంతో వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో తుమ్మ మధును సంప్రదించారు. దీంతో ‘టీనో సైను వైటీస్’అనే వ్యాధికి ‘అగ్నికర్మ’ అనే చికిత్స చేశారు. తద్వారా వారానికి ఒకటి చొప్పున ఆరు పర్యాయాలకు రెండో దశలో చేతి వేలుకు కదలిక వచ్చింది. ఈ వ్యాధి లక్షణం కండరంలో వాపు ఉంటుందన్నారు. దీని వల్ల వేలు కదలికలు మందగిస్తాయని, నొప్పి తీవ్రంగా ఉంటుందని, చికిత్స అనంతరం ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలిపారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద వైద్యంలో ఖర్చు లేకుండా నయం చేయొచ్చని నిరూపించామని వైద్యులు పేర్కొన్నారు. ఈ చికిత్సలో సర్జన్లు మేఘన, కేతన, శివాని హరినాథ్ తదితరులు ఉన్నారు.
కాజీపేట మీదుగా 8 ఫెస్టివల్ ట్రైన్లు
కాజీపేట మీదుగా 8 ఫెస్టివల్ ట్రైన్లు