
ఏఐతో పని సరళం..
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. కఠిన పనిని కూడా సరళం చేస్తోందని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్‌అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ కళాశాలలో మూడురోజులుగా నిర్వహించిన ‘డేటా డివైన్ టీచింగ్ బిజినెస్ అనాలటిక్స్ అండ్ పవర్ బీఐ ఫర్ ఎడ్యుకేటర్స్’ వర్క్‌షాప్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అధ్యాపకులకు లెర్నింగ్ నిరంతర ప్రక్రియ అన్నారు. మానవ మేధస్సుకు ప్రత్నామ్నాయం లేదన్నారు. అయితే టెక్నాలజీలో ఎప్పటికప్పడు వస్తున్న మార్పులకనుగుణంగా విద్యాబోధనలో పట్టుకలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల అవసరాలకు తగ్గట్లు అధ్యాపకులు నాణ్యమైన విద్యనందించేలా సిద్ధం కావాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ పి. అమరవేణి, డీన్ కె. రాజేందర్, సీడీసీ డీన్ పి. వరలక్ష్మి, యూనివర్సిటీ పీజీ కళా శాల ప్రిన్సిపాల్ ఎస్. నర్సింహాచారి, డాక్టర్ ఫణీంద్ర, డాక్టర్ ప్రగతి, తదితరులు పాల్గొన్నారు.
పోక్సో కేసులో నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు
ఏటూరునాగారం : పోక్సో కేసులో నేరస్తుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ములుగు జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఎస్సై రాజ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. 2022లో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన గౌస్‌పాషా (కిరాణాషాపు) లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో నేరస్తుడు గౌస్‌పాషాకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్సై తెలిపారు.