
సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి
డోర్నకల్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన పలు ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయుల అధిక సంఖ్యలో హాజరుకావా ల న్నారు. యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు అజీజ్, శివప్రసాద్, టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు వై.సాయిబాబు, పూల్‌రాజ్, నాయకులు సీతారామారావు, అజయ్‌సింగ్ ఉన్నారు.
గూడూరు:పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు వీరూనాయక్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభాకర్, మంగీలాల్, చందా, వెంకటేశ్వర్లు, రామయ్య పాల్గొన్నారు.