ఉత్తములెవరో.. | - | Sakshi
Sakshi News home page

ఉత్తములెవరో..

Aug 30 2025 7:54 AM | Updated on Aug 30 2025 7:54 AM

ఉత్తమ

ఉత్తములెవరో..

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు కసరత్తు

సాక్షి, మహబూబాబాద్‌ : ‘ఉత్తమ గురువు లభించిన శిష్యుడు అదృష్టవంతుడు.. అలాగే ఉత్తమ శిష్యుడు లభించిన గురువు ధన్యుడు’ అంటారు. మంచి గురువు చేతిలో విద్యార్థి ఉన్నత విలువలు నేర్చుకుంటాడు. మంచి శిష్యుడిని గురువు తన లక్ష్యానికి అనుగుణంగా తయారుచేస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఉత్తమ గురువులను ప్రతీ సంవత్సరం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి(ఉపాధ్యా య దినోత్సవం) సందర్భంగా సన్మానించుకోవడం ఆనవాయితి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఉత్తమ గురువులను ఎంపిక చేయడంలో మాత్రం చాలా విధాలుగా కసరత్తు చేయాల్సి వస్తుంది.

ఎంఈఓల ద్వారా ప్రతిపాదనలు

గతంలో ఉపాధ్యాయులు తాము చేసిన పనుల వివరాలు తెలుపుతూ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపిక చేయాలని దరఖాస్తు చేసుకునే వారు. అయితే అవార్డును అడుక్కునేలా ఉన్న ఈ విధానం కాకుండా ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులే అవా ర్డుకు ఎంపిక చేయాలని ఉపాధ్యాయులు అభిప్రా యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎంఈఓలు ఉపాధ్యాయుల పేర్లను ఎంపిక చేసి జిల్లా కమిటీకి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఇందులో ప్రతీ మండలం నుంచి హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ క్యాటగిరీల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి డీఈఓకు పంపిస్తున్నారు.

ఉత్తమ గురువుగా ఎంపిక కావాలంటే..

ఉత్తమ గురువుగా ఎంపిక చేయాలంటే విమర్శలు లేకుండా ఉండాలి. పాఠశాలకు హాజరయ్యే విధానం.. పనిచేస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలు, బడి బయట ఉన్న పిల్లలను చేర్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, బడి, శుభ్రత, పరిసరాల శుభ్రత మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రధానోపాధ్యాయులు అయితే గత రెండు సంవత్సరాలుగా పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం, సైన్స్‌ఫెయిర్‌, ఇన్‌స్పైర్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం, విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపిక కావ డం, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో ప్రతిభ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులు అయితే పై లక్షణాలతోపాటు, వారు బోధించిన సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణలోకి తీసుకుంటారు.

విద్యాశాఖలో సందడి..

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియతో విద్యాశాఖలో సందడి మొదలైంది. ఉత్తమ గురువులను ఎంపిక చేయడంలో గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కొందరి ఎంపికలో పక్షపాతంగా వ్యవహరించారని, కనీస విలువలు కూడా లేనివారిని ఎంపి క చేశారని ఉపాధ్యాయ వర్గంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎంపిక ఎలా ఉంటుందో అనే సందేహం మొదలైంది. ఈ ఏడాది గతానికి భిన్నంగా మొదటి రౌండ్‌లో ఎంఈఓలే ఉత్తముల ఎంపిక ప్రతిపాదనలు పంపించడంతో ఏదైనా విమర్శలు వస్తే వారే బాధ్యులు కావాల్సి వస్తుంది. అందుకోసం ఎంఈఓలు శుక్రవారం వరకు ప్రతిపాదనలు పంపించాల్సి ఉండగా ఆచీతూచీ ఎంపిక చేయడంలో మరికొంత గడువు కావాలని కోరినట్లు సమాచారం.

మండలస్థాయి నుంచి గుర్తింపు

ఎంఈఓల ద్వారా ప్రపోజల్స్‌ స్వీకరణ

పనితనమే ప్రామాణికంగా ఎంపిక

విద్యాశాఖలో మొదలైన సందడి

పక్షపాతం లేకుండా ఎంపిక

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు పంపించిన మార్గదర్శకాలను అనుసరించి జరుగుతుంది. ఎక్కడ విమర్శలకు తావులేకుండా మొదటి రౌండ్‌లో ఎంఈఓల ద్వారా వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ ద్వారా తుది జాబితా తయారు చేస్తారు. అందులో లోటుపాట్లు ఉంటే సరిచేసి కలెక్టర్‌ పరిశీలన తర్వాత తుది జాబితా ప్రకటిస్తాం.

– రవీందర్‌రెడ్డి, డీఈఓ

ఉత్తములెవరో..1
1/2

ఉత్తములెవరో..

ఉత్తములెవరో..2
2/2

ఉత్తములెవరో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement