సమస్యలు తలెత్తకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తలెత్తకుండా చూడాలి

Aug 30 2025 7:54 AM | Updated on Aug 30 2025 12:10 PM

నెల్లికుదురు: వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, సీజ్‌ చే సిన వాహనాలు, రిసెప్షన్‌లో రికార్డులు, రైటర్‌ రూమ్‌ పరిశీలించారు. అనంతరం డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కలసి స్టేషన్‌ ఆవరణలో మొ క్కలు నాటారు. పోలీస్‌ అధికారులు తరచూ గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. బ్లూ కోల్డ్స్‌, పెట్రో కార్‌ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత తొందరగా సమస్యలు పరిష్కరించాలని, జూదం, పీడీఎస్‌రైస్‌ అక్రమరవాణా జరగకుండా నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్‌ నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీని ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిశోర్‌, డీసీఆర్పీ సీఐ సత్యనారాయణ, సీఐ గణేష్‌, ఎస్సై రమేష్‌ బాబు, ఏఎస్సైలు పాల్గొన్నారు.

నేడు 1,200 మెట్రిక్‌ టన్నుల యూరియా రాక

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ పట్టణానికి శనివారం 1,200 మెట్రిక్‌ టన్నుల యూరియా రానుందని ఎమ్మెల్యే మురళీనా యక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 800 మెట్రిక్‌ టన్నులు, సాయంత్రం 400 మెట్రిక్‌ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని, అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. యూరియా పంపిణీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

‘ఆది కర్మయోగి’ ఫలాలు అందించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: ఆది కర్మయోగి అభినయాన్‌ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆ పథకం ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నా రు. కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో ని ర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మా ట్లాడారు. జిల్లాలో 18 మండలాలకు 92 గ్రామపంచాయతీల పరిధిలో అర్హులైన గిరిజనులకు ఆధార్‌కార్డు, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌, పీఎం జనరల్‌ యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి, రేషన్‌ కా ర్డు, సికిల్‌ సెల్‌టెస్టులు చేయడం, వందరోజుల పని దినాలు, ముద్ర యోజన కింద రుణాలు, ఫారెస్ట్‌రైట్‌ యాక్ట్‌పైన విడతల వారీగా అవగా హన కల్పిస్తున్నామన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఆర్డీఓ గణేష్‌, ట్రైబల్‌ వెల్ఫ్‌ర్‌ డీడీ దేశీరాంనాయక్‌, డీవీహెచ్‌ఓ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి ప్రేమ్‌కుమార్‌, విద్యాశాఖ ఉద్యోగులు శ్రీరాములు, ఆజాద్‌చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

దివ్యాంగులకు పింఛన్‌ పెంచాల్సిందే..

తొర్రూరు/మరిపెడ రూరల్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ పెంచాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లో పింఛన్‌ లబ్ధిదారుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో వీహెచ్‌పీఎస్‌, ఎంఆర్‌పీఎస్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం తొర్రూరు డివి జన్‌ కేంద్రంలో, మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో దివ్యాంగులతో సన్నాహక సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మా దిగ మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే పింఛన్‌ పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ మోసం.. ప్రతిపక్షాల మౌనం సరికాదన్నారు. పింఛన్లు పెంచుతారా.. లేక రాజీనా మా చేస్తారా.. అని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లో జరిగే సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. వీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు యాకూబ్‌పాషా, భూక్యా వెంకన్న, నాయకులు మంద యాకమల్లు, బచ్చలి వెంకన్న, వెంకన్న, రాము, లింగన్న, భరత్‌కుమార్‌, చిన్నసుబ్బారావు, రమేష్‌, రవీందర్‌, పరశురాములు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement