
సమాచార హక్కు చట్టానికి తూట్లు
మహబూబాబాద్ అర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు.. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నియంత్రణలో ఉండే సంస్థల నుంచి సమాచారాన్ని పొందవచ్చు. కానీ, జిల్లాలోని వివిధ శాఖల్లోని అధి కారులు సమాచారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నేడు జిల్లాకు రానున్న రాష్ట్ర స మాచారహక్కు చట్టం కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, శ్రీనివాసరావు, మోహిసినా పర్వీన్, దేశాల భూపాల్ రానున్నారు. వీరి పర్యటన తర్వాతనైనా జిల్లాలోని అధికారుల్లో మార్పు వస్తుందో వేచిచూడాలి.
సమాచారమివ్వని అధికారులు
● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారు.. వారి వేతనాలు, ఈఎఫ్, పీఎఫ్ వంటి సమాచారం కావాలని జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. కానీ, అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతోపాటు తమకు ప్రజాప్రతినిధుల అండ ఉందని బెదిరింపులకు పాల్పడ్డ సందర్భాలు ఉన్నాయి.
● ఎస్సీ సంక్షేమ శాఖలో ఓ ఉద్యోగి నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం కావాలని ఓ వ్యక్తి సంబంధిత జిల్లా అధికారులకు దరఖాస్తు చేశాడు. సమాచారం ఇవ్వకపోవడంతో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో సమాచారం అందించాలని రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినా బేఖాతారు చేయడం గమనార్హం.
సమాచారం అందించాలి
సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజుల్లోనే అధికారులు సమాచారం ఇవ్వాలి. కానీ దరఖాస్తు చేసి మూడేళ్లు గడిచినా అధికారులు సరైన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా, రాష్ట్ర అధికారులు స్పందించి జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయో.. పరిశీలించి న్యాయం చేయాలి.
– మంద శశి కుమార్, మానుకోట పాత బజార్
సమాచారం అందించని అధికారులు
నేడు జిల్లాకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు

సమాచార హక్కు చట్టానికి తూట్లు