
వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇవ్వాలి
మహబూబాబాద్ అర్బన్: జువైనల్ హోమ్‌లోని పిల్ల లకు వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జువైనల్ హోమ్‌ను శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోమ్‌లోని గదులు, పరిసరాలు, కిచెన్ షెడ్, డైనింగ్‌హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. స్టడీ అవర్‌లో ఉన్న పిల్లలతో మాట్లాడారు. హోమ్‌లో ఉన్న పిల్లల వివరాలు తెలుసుకున్నారు. అనాథ పిల్లలు, ఇంటి నుంచి పారిపోయినవారు, మాదకద్రవ్యాలకు బానిసైన పిల్లలు, చిన్న కేసుల్లో ఉన్న బాల సదనంలోని బాలుర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని, వారిలో మార్పు కోసం క్రీడా సాంస్కృతిక సామాజిక అంశాల మీద శిక్షణ అందించాలన్నారు. తనిఖీలో జువైనల్ సూపరింటెండెంట్ కృష్ణవేణి, డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్‌బాబు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీలతో సమావేశం
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలను ఈనెల 30వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 2న పంచాయతీల వారీగా ఫొటోతో కూడిన తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్‌టొప్పో, అనిల్‌కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
జువైనల్ హోమ్ ఆకస్మిక తనిఖీ