
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
● డీఎస్పీ తిరుపతిరావు
కేసముద్రం: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరా వు, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధి జెడ్పీహెచ్‌ఎస్, పా లిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు, సీనియర్ క్రీడాకా రులకు నిర్వహించిన వన్ కే రన్ ను ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్, హాకీలో రాణిస్తున్న క్రీడాకా రులకు సన్మానించారు. అనంతరం వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్రీడాసామగ్రిని, కల్వల మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆట వస్తువులను అందజేశారు. సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, ఎంఈఓ యాదగిరి, అల్లం నాగేశ్వర్‌రావు, మురళీ, వెంకన్న, సురేందర్, హెచ్‌ఎం రాజు, పీడీ కొమ్ము రాజేందర్, పాలిటెక్నిక్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నర్సయ్య పాల్గొన్నారు.