
మేడారంలో శాశ్వత పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వందేళ్ల ప్రణాళికతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సమ్మక్క–సారలమ్మల గద్దెల వరుస క్రమంలో పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు పూజారులు సమాలోచనలు చేశారు. శుక్రవారం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, వివిధశాఖల అధికారులు, పూజారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ రీ డెవలప్‌మెంట్ ప్లాన్, ఆర్కియాలజిస్ట్, వివిధ శాఖల అధికారుల ద్వారా చేపట్టనున్న వివరాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతరలో శాశ్వత అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చేయాలని ఆదేశించారు. జాతర సమయం వరకు మొదటి విడత పనులు పూర్తి చేయాలన్నారు. భక్తులకు సులువైన దర్శనంకోసం గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేయాలన్నారు. మహాజాతర పనులు నాణ్యతతో శాశ్వతంగా నిలిచేలా అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. ముందుగా మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈఓ వీరస్వామి, అధికారులు పాల్గొన్నారు.
వందేళ్ల మాస్టర్ ప్రణాళికతో
అభివృద్ధి
సమీక్షలో రాష్ట్ర మంత్రి సీతక్క

మేడారంలో శాశ్వత పనులు