
32కిలోల గంజాయి స్వాధీనం
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్‌లో జీఆర్‌పీలు 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. కాజీపేట జీఆర్‌పీ స్టేషన్‌లో సీఐ నరేష్‌కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశాకు చెందిన ధరందీర్ నాయక్, రామ బెహరా, నమిత బెహెరా ముగ్గురు కలిసి 16 ప్యాకెట్లతో గంజాయిని పార్సిల్ చేసి ట్రావెల్ బ్యాగులో భద్రపరిచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్రలోని దాదర్‌కు తరలిస్తున్నారు. కాగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం కాజీపేట జంక్షన్‌కు చేరుకోగా తని ఖీలో భాగంగా జీఆ ర్‌పీ ఎస్సై ఎం.అభినవ్ తన బృందంతో తనిఖీలు చే శారు. పోలీసుల కదలికలు గమనించిన నింది తులు గంజాయి బ్యాగులతో కిందికి దిగి వెళ్తున్నా రు. అనుమానం కలగడంతో నిందితులను ఆపి త నిఖీ చేయగా బ్యాగుల్లో గంజాయి తరలిస్తు పట్టుబ డ్డారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని, నిందితుల నుంచి రెండు ఫోన్లు, గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
రూ.16లక్షల విలువైన
గంజాయి పట్టివేత
ఒడిశాకు చెందిన ముగ్గురి రిమాండ్