హన్మకొండ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాల్లో నీరు నిలుస్తోంది.. నీరు అలాగే నిల్వ ఉంటే పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంద. దీంతో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించి పంటలను కాపాడుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ.విజయ భాస్కర్ సూచించారు.
అధిక వర్షాలకు వరి పైరులో పాము పొడ, కాండం కుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు వాలిడామైసిన్ 2 మిల్లి లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. కాండంకుళ్లు తెగులు ఆశించిన పంటలో హెక్సాకొనజోల్ 2 మి.లీ.లీటరు నీటికి లేదా కార్బెండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి 7–10 రోజుల వ్యవధితో 2 సార్లు పిలకల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. నీటి ముంపునకు గురైన వరి పొలాల్లో సల్ఫైడ్ దుష్ప్రభావం ఆశించడానికి అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. దీని గమనించిన రైతులు వరి పంటలో మొక్కల వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగు నీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెరల్రు వచ్చేవరకు ఆరబెట్టి మళ్లీ నీరు ఇవ్వాలి.
వివిధ పంటల్లో తగిన
జాగ్రత్తలు తీసుకోవాలి
సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
సస్యరక్షణ చర్యలు
సస్యరక్షణ చర్యలు
సస్యరక్షణ చర్యలు