
కాజీపేట–హడప్సర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ల పెంపు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట నుంచి హడప్సర్ వెళ్లే హడప్సర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అప్ అండ్ డౌన్‌లో అదనపు చైర్ కార్ కోచ్‌లు పెంచినట్లు రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. అదనపు కోచ్‌లు సెప్టెంబర్ 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు.
2న డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల్లో ఫైనల్ ఇయర్‌లో ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులకు సెప్టెంబర్ 2న ఇన్‌స్టంట్ పరీక్ష నిర్వహించనున్నట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు. ఈనెల 29న జరగాల్సిన పరీక్షలు భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేశారని పేర్కొన్నారు.
అన్ని రంగాలకు రుణాలు
● హైదరాబాద్ జోన్ హెడ్
ధారాసింగ్ నాయక్
న్యూశాయంపేట : అన్ని రంగాలను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ పథకాలను అమలు చేస్తోందని హైదరాబాద్ జోన్ హెడ్ ధారాసింగ్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన దేశవ్యాప్త మెగా రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొని పలు రంగాలకు రూ.67 కోట్ల రుణ మంజూరు పత్రాలను వినియోగదారులకు అందజేశారు. ఆగస్టులో మొత్తం రూ.150 కోట్ల రుణాలు వివిధ రంగాలకు సీబీఐ వరంగల్ రీజియన్ మంజూరు చేసిందన్నారు. వరంగల్ రీజినల్ హెడ్ వి.కృష్ణమోహన్, చీఫ్ మేనేజర్లు టి.సాయికుమార్, ఎండీ ఖాదర్, హెచ్.శివశంకర్, బ్రాంచి మేనేజర్లు రాబర్ట్ జోన్స్, జి.రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

కాజీపేట–హడప్సర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ల పెంపు

కాజీపేట–హడప్సర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ల పెంపు