హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

Jul 27 2025 7:10 AM | Updated on Jul 27 2025 7:10 AM

హోరాహ

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

సెమీస్‌కు చేరిన జట్లు

వరంగల్‌ స్పోర్ట్స్‌: మహబూబాబాద్‌ జిల్లా అమ్యోచూర్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హనుమకొండలోని వరంగల్‌ క్లబ్‌, కిట్స్‌ కళాశాల ఇండోర్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్‌–17 బాలబాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు శనివారం హోరాహోరీగా కొనసాగాయి. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో 20 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు తలపడుతున్నారు. రెండో రోజు జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడిన పలు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీ ఫైనల్‌ను పూర్తి చేసుకుని నేడు(ఆదివారం) ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుందని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ మూల జితేందర్‌రెడ్డి, డాక్టర్‌ కొమ్ము రాజేందర్‌ తెలిపారు.

పాఠశాలల విద్యార్థులకు ఆధార్‌

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు ఆధార్‌ లేకపోవడం, మరికొందరి ఆధార్‌లో తప్పులు ఉండడంతో ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌)లో నమోదు కావడం లేదు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 65 శాతం మంది విద్యార్థుల వివరాలు మాత్రమే అపార్‌లో నమోదు చేశారు. ఇంకా 35 శాతం అపార్‌లో నమోదు కావాల్సి ఉంది. వీటిని సరిచేసేందుకు విద్యాశాఖ ఉపక్రమించింది. అందుకు హనుమకొండ జిల్లాకు బాట్రానిక్స్‌ కంపెనీ వారికి కాంట్రాక్టు ఇచ్చింది. కంపెనీ ప్రతినిధులు అన్ని మండలాల్లో ఆధార్‌ కోఆర్డినేటర్లను నియమించుకొని పాఠశాలలకే వచ్చి ఆధార్‌ నమోదు చేస్తారు. వివరాలు తప్పులున్న ఆధార్‌లో సరిచేసి మళ్లీ ఆధార్‌ పొందేందుకు, కొత్తగా తీసుకునేవారికి కూడా పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లాలోని ఆత్మకూరు, ఐనవోలు, ధర్మసాగర్‌, వేలేరు మండలాల పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు చేస్తున్నారు. విద్యార్థుల ఆధార్‌ సరిచేసేవిధంగా, నమోదు ప్రక్రియ జరిగేలా పాఠశాలల హెచ్‌ఎంలు చూడాలని డీఈఓ వాసంతి ఆదేశించారు.

హోరాహోరీగా  బ్యాడ్మింటన్‌ పోటీలు 
1
1/1

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement