
నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
న్యూశాయంపేట : పేద మైనారిటీలకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) డిప్యూటీ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ ఆఫీసర్ జుబేదా అన్నారు. శనివారం హనుమకొండ ములుగురోడ్డులోని రీజినల్ లేవల్ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఈ)లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించి వాటికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటిలో బాలురకు వరంగల్, జక్కలొద్ది బాలుర గురుకులం, బాలికలకు హనుమకొండ హంటర్‌రోడ్‌లోని బాలికల గురుకులంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని, ఎంపికై న వారికి త్వరలో నియామక పత్రాలు అందిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యనందిస్తున్న గురుకులాలను పేద మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. సమావేశంలో రీజినల్ లేవల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జంగా సతీశ్, విజిలెన్స్ ఆఫీసర్లు సయ్యద్ అక్బర్, మక్బూల్‌పాషా, ఉర్దూ ఆఫీసర్ జాహేదా బేగం, తదితరులు పాల్గొన్నారు.
టెమ్రిస్ డిప్యూటీ సెక్రటరీ జుబేదా