
మహిళా కూలీలతో మమేకమై..
● పొలంలో వరి నాటు వేసిన డిప్యూటీ స్పీకర్
మరిపెడ రూరల్: మరిపెడ మండలంలో డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఉల్లెపల్లి గ్రామ సమీపంలోని వరినాట్లు వేస్తున్న మహిళలకు చూసి ఎమ్మెల్యే తన కాన్వాయ్‌ని నిలిపారు. మహిళలను ఆప్యాయంగా పలకరించారు. వారితో కలిసి నాటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఇంటర్ చదివే వరకు అన్ని రకాల వ్యవసాయ పనులు చేశానని అన్నారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.