
కలలకు రంగులద్దారు. ఆశలకు జీవం పోశారు. భవిష్యత్‌కు భరోసా
జనగామ: నాన్న అబ్దుల్ మజీద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా పని చేశారు. అమ్మ షీరీ గృహిణి. పంద్రాగస్టు, జనవరి 26 ఇలా జాతీయ దినోత్సవ కార్యాక్రమాల వేళ నాన్న తన వెంట తీసుకెళ్లేవారు. అప్పుడే కలెక్టర్ కావాలనే తపన కలిగింది. చదువు విషయంలో నాన్న ఎప్పుడు రాజీ పడలేదు. కష్టపడి చదువుకుని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించా. నాలుగేళ్లు పని చేశా. అయినా తృప్తి లేదు. నాన్నా.. నేను సివిల్ సర్వీసు వైపు వెళ్తా అన్నాను. ‘గో హెడ్’ అన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశా. అంత పెద్ద జాబ్ వదులుకున్నా, మొదటిసారి ర్యాంకు రాకపోయినా.. ప్రోత్సహించారు. నాన్న ఎలాంటి ఒత్తిడి లేకుండా పెంచారు. తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువే. నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి, మన భవిష్యత్‌కు బాటలు వేసే తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే పిల్లల జన్మకు సార్థకత అని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు.
శ్రమకోర్చి ప్రయోజకుల్ని చేసి..
జీవితాలకు బాటలు వేసిన తల్లిదండ్రులు
ఆదర్శంగా నిలుస్తున్న పేరెంట్స్
నేడు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం
అనుబంధాన్ని పంచుకున్న
అధికారులు, ప్రజాప్రతినిధులు
కంటికి రెప్పలా కాపాడుకోవాలి

కలలకు రంగులద్దారు. ఆశలకు జీవం పోశారు. భవిష్యత్‌కు భరోసా

కలలకు రంగులద్దారు. ఆశలకు జీవం పోశారు. భవిష్యత్‌కు భరోసా