
మున్నేరు వాగును పరిశీలించిన డీఎస్పీ
డోర్నకల్: డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగును శనివారం డీఎస్పీ తిరుపతి పరిశీలించారు. డోర్నకల్ సీఐ బి.రాజేష్‌తో కలిసి మున్నేరువాగు ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం డీఎస్పీ మాట్లాడారు. వాగులో వరద ఉధృతి పెరిగిందని, చేపలవేటకు వెళ్లొద్దన్నారు. మున్నేరు బ్రిడ్జితో పాటు వాగు సమీపంలో ఫొటోలు దిగే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.
సాంకేతిక సమస్యలు
లేకుండా చూడాలి
మహబూబాబాద్: లబ్ధిదారులు పింఛన్ తీసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్‌రాజు అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం పింఛన్ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీ కార్యదర్శులు, పోస్టాఫీసు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రాజు మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యలు పునరా వృతం కాకుండా పేస్ రీడింగ్ ద్వారా పింఛన్ పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డోర్నకల్ వాసికి డాక్టరేట్
డోర్నకల్: డోర్నకల్‌లోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పారుపల్లి రవి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. ప్రస్తుతం హైకో ర్టు న్యాయవాదిగా పని చేస్తున్న రవి సీనియర్ ఆచార్యులు వై.విష్ణుప్రియ పర్యవేక్షణలో ‘భారతదేశంలో కుటుంబ వ్యవస్థ రక్షణ, సామాజిక, న్యాయ అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసి ఓయూ నుంచి డాక్టరేట్ పొందాడు.
పాఠశాలను బాగు చేయండి
మహబూబాబాద్ అర్బన్: వర్షం కురిస్తే చాలు పాఠశాల ఆవరణ మొత్తం బురదమయంగా మారుతుందని, బాగు చేయాలని మానుకోట మున్సిపాలిటీ పరిధి బేతోలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేడుకుంటున్నారు. పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు సుమారు 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాలు గు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాఠశాల ఆవరణ మొత్తం జలమయమై బురదగా మారింది. కాగా కలెక్టర్, వి ద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని పాఠశాల ఆవరణలో మొరం పోయించి శుభ్రం చే యించాలని శనివారం విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దరఖాస్తులకు నోటీసులు
తయారు చేయాలి
బయ్యారం: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు నోటీసులు తయారు చేసి ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) అనిల్‌కుమార్ ఆదేశించారు. బయ్యారం తహసీల్దార్ కార్యాలయాన్ని శనివా రం సందర్శించారు. అనంతరం ఆయన రెవె న్యూ సిబ్బందితో మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు.
ప్రతీ విద్యార్థిపై
ప్రత్యేక శ్రద్ధ వహించాలి
తొర్రూరు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. ప్రతీ పాఠశాలలో లైబ్రరీ పీరియడ్ కేటాయించాలని, రీడింగ్ కార్నర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని, పేద బిడ్డలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఎంఈఓ బుచ్చ య్య, హెచ్‌ఎం లక్ష్మీనారాయణ ఉన్నారు.

మున్నేరు వాగును పరిశీలించిన డీఎస్పీ

మున్నేరు వాగును పరిశీలించిన డీఎస్పీ

మున్నేరు వాగును పరిశీలించిన డీఎస్పీ