
తగ్గని పాకాల వరద ఉధృతి
గార్ల: గార్ల సమీపంలోని పాకాల ఏరు శనివారం చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహించింది. ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బయ్యారం పెద్దచెరువు అలుగు పోస్తుండడంతో పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రమైన గార్లకు రాంపురం, మద్దివంచ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసరాలు కోసం ఆటోల ద్వారా బయ్యారం, డోర్నకల్ మండలాలకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించి రహదారి సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.