
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
నెల్లికుదురు: పరిశుభ్రత, న్యూట్రిషన్, హెల్త్, ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. స్థానిక కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, పీహెచ్‌సీని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో పరిసరాలను పరిశీలించి సబ్‌సెంటర్ల వారీగా హెల్త్ ప్రొఫైల్ మె యింటైన్ చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల పరిసరాలను అధికారులతో కలి సి పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ కుమార్, ఎంపీఓ పద్మ, ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు, కేజీబీవీ ప్రత్యేక అధి కారి సుమలత, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో