
పరీక్షలకు సర్వం సిద్ధం
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరగనున్న గ్రామ పరిపాలన అధికారుల పరీక్ష, అనంతారం మోడల్ స్కూల్‌లో లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శనివారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్షలకు 181 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. గ్రామ పరిపాలన అధికారుల పరీక్షకు 56 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.