వరంగల్ స్పోర్ట్స్: నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అని, క్రీడాకారులు ఓటమికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుౖగైన శిక్షణ, అత్యాధునిక వసతుల కల్పన కోసం సీఎం రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి సొంత గడ్డకు పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 581 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన అథ్లెట్లు ఆగస్టు 3, 4 తేదీల్లో జేఎన్ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్‌రెడ్డి
జేఎన్‌ఎస్‌లో అట్టహాసంగా
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ఓటమి రేపటి విజయానికి నాంది