
కాజీపేటలో రైల్వే ఇన్‌చార్జ్ జీఎం తనిఖీ
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్‌లో సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్ జనరల్ మేనేజర్ సందీప్‌మాథూర్ తనిఖీ చేపట్టారు. ఇటీవల అదనపు జీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాథూర్.. మొదటి సారి ప్రత్యేక రైలులో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లిలో తనిఖీలు చేసుకుంటూ కాజీపేట జంక్షన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం భర్తీష్‌కుమార్ జైన్‌తో కలిసి కాజీపేట రైల్వే స్టేషన్ అమృత్ భారత్ అభివృద్ధి పనులు, ప్రయాణికుల వెయింటింగ్ హాల్, టాయ్‌లెట్స్‌ను తనిఖీ చేసి నిర్వహణలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి, ఎస్కలేటర్, లిఫ్టు నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. లోకోపైలెట్ కార్యాలయం, రూట్‌రిలే ఇంటర్‌లాకింగ్ కార్యాలయంలోకి వెళ్లి సిగ్నల్ రిలేలను తనిఖీ చేశారు. తనిఖీల్లో సికింద్రాబాద్ సీనియర్ డీఓఎం సురేశ్‌రెడ్డి, సీనియర్ డీసీఎం సిఫాలి, సీపీటీఎం ఎలివేందర్ యాదవ్, డీఓఎం జనరల్ సుధీర్, సీనియర్ డీఎస్‌టీఈ ప్రియ అగర్వాల్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్‌వాణి, ఏసీఎం ఐఎస్‌ఆర్ మూర్తి, కాజీపేట స్టేషన్‌మేనేజర్ అగ్గి రవీందర్, కాజీపేట సీనియర్ డీఎంఈ డీజిల్ వెంకటకుమార్, సీనియర్ డీఈఈ ఈఎల్‌ఎస్ సూర్యనారాయణ, ఏడీఈఎన్ సంతోశ్‌కుమార్, ఎస్‌ఎస్‌ఈ రాజన్న, ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ , జీఆర్పీ సీఐ నరేశ్‌కుమార్ ఉన్నారు. కాగా, ఇన్‌చార్జ్ జీఎంకు కాజీపేట రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్‌బ్రాంచీ కార్యవర్గ సభ్యులు పి.వేదప్రకాశ్, ఎస్.కె.జానీమియా, జి.రాజేశ్వర్, ఎ.సత్యనారాయణ, నరేశ్‌యాదవ్, నాగరాజు, తిరుపతి యాదగిరి.. డీజిల్ కాలనీలో మంచినీటి సమస్య, క్వార్టర్స్‌లో విద్యుత్ సప్లయ్, కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కాజీపేట మజ్దూర్ యూనియన్ ఆల్ బ్రాంచీస్ కోఆర్డినేటర్ నాయిని సదానందం, టెక్నికల్ బ్రాంచ్ సెక్రటరీ ఆర్.సమ్మయ్య ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై ఇన్‌చార్జ్ జీఎం సందీప్‌మా థూరుకు వినతి పత్రం అందజేశారు.
అమృత్ భారత్ పనుల పరిశీలన