
‘వేం’ కారునుంచి పొగ
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం సోమ్ల తండా గ్రామ శివారులోని హెలిపాడ్ సమీపంలో నిలిపిన ఇన్నోవా కారు నుంచి మంగళవారం ఒక్కసారిగా పొగ వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ల్యాండ్ అయ్యే హెలిపాడ్ సమీపంలో రోడ్డు పక్కన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వాహనం నిలిపారు. అందులో నుంచి పొగ రాగానే గమనించి అగ్నిమాపక సిబ్బంది వెంటనే టియర్ గ్యాస్ ఉపయోగించి ఆర్పివేశారు. కారు ఇంజిన్ భాగంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ జరిగి పొగ వచ్చిందని, పొగ ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పేర్కొన్నారు.