హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2024–2025 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజు ఈ నెల 19వ తేదీ లోపు చెల్లించాలని పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 19వతేదీ సాయంత్రం 5గంటలలోపు తమ దరఖాస్తులను పీఠం కార్యాలయంలో సమర్పించాలన్నారు. అలాగే, ఈ నెల 23 వరకు ఆలస్య రుసుముతో చెల్లించొచ్చని తెలిపారు. వివరాలకు 9989417299, 9989139136 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
భాగ్యనగర్, గోల్కొండ,
శాతవాహన రైళ్లకు
పర్మనెంట్ కోచ్‌ల పెంపు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రయాణించే భాగ్యనగర్, గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అప్ అండ్ డౌన్ మార్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా ఒక 3 ఏసీ (ఎకనామి) కోచ్‌ను పర్మనెంట్ పెంపుదల చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
థర్డ్ ఏసీ (ఎకనామి) రైళ్ల కోచ్‌ల వివరాలు..
జూలై 13వ తేదీ నుంచి సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17233) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, జూలై 14వ తేదీ నుంచి సిర్పూర్‌కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, జూలై 13 తేదీ నుంచి గుంటూరు–సికింద్రాబాద్ (17201) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, జూలై 14వ తేదీ నుంచి సికింద్రాబాద్–గుంటూర్ (17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, జూలై 13వ తేదీ నుంచి విజయవాడ–కాచిగూడ (12713) శాతవాహన ఎక్స్‌ప్రెస్, జూలై 13వ తేదీ నుంచి కాచిగూడ–విజయవాడ (12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు థర్డ్ ఏసీ (ఎకనామి) కోచ్‌లు పెంచినట్లు సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
కోతుల బెడదను నివారించాలని రాష్ట్రపతికి ఉత్తరం
● పోస్ట్ చేసిన
మహబూబాబాద్ జిల్లా గార్లవాసి
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో కోతుల బెడదను నివారించాలని కోరుతూ గార్లకు చెందిన కందునూరి ఈశ్వర్‌లింగం మంగళవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసి స్పీడ్‌పోస్ట్ చేశారు. మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఇళ్లల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే భయపడుతున్నారని, ఇక పత్తి, వరి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయన్నారు. పలుమార్లు కలెక్టర్, అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఉత్తరం ద్వారా వివరించారు. కోతుల సమస్యపై జిల్లాలో ఎవరూ పట్టించుకోకపోవడంతోనే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జికి ఉత్తరం రా సి పోస్ట్ చేసినట్లు ఈశ్వర్‌లింగం వెల్లడించారు.
19 వరకు ఎంఏ తెలుగు పరీక్ష ఫీజు గడువు