
సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు
వరంగల్ క్రైం: ద్విచక్రవాహనాలకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు మారిస్తే వాహనదారుడితోపాటు మార్చిన మెకానిక్‌పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు హెచ్చరించారు. అధిక శబ్దం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కేయూసీ జంక్షన్ వద్ద రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్రవాహనాలకు ఏర్పాటు చేసిన అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను గుర్తించి తొలగించినట్లు పేర్కొన్నారు. వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్డురోలర్‌తో ధ్వంసం చేసినట్లు వివరించారు. ఇందులో హనుమకొండకు చెందిన 275, కాజీపేట 111, వరంగల్‌వి 75 ౖసైలెన్సర్లు ఉన్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాల సైలెన్సర్లను మార్చడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతోపాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ శబ్దం చేసే ద్విచక్రవాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన పే ర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు రా మకృష్ణ, సీతారెడ్డి, వెంకన్న, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్‌రావు
రోడ్డు రోలర్‌తో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ధ్వంసం