
ఆలోచన అదుర్స్..
పాలకుర్తి టౌన్ : సాధారణంగా పానీ పూరి బండి ఒక ప్రాంతంలో ఆ రహదారిపైనే కనిపిస్తుంది. లేదా షాపులో మాత్రమే ఉంటుంది. వినియోగదారులు అక్కడికెళ్లి మాత్రమే తినాల్సి ఉంటుంది. అయితే ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. వినియోగదారులు వ్యాపారి వద్దకు కాకుండా వ్యాపారే వినియోగదారుడి వద్దకు వెళ్లేలా కొత్తగా ఆలోచించాడు. అనుకున్నదే తడువుగా బైక్(మొబైల్ పానీ పూరి)కు పానీపూరి బండి అమర్చి నేరుగా వినియోగదారుల వద్దకే వెళ్లి విక్రయిస్తున్నాడు. అతనే పాలకుర్తి మండలం టీఎస్‌కే తండాకు చెందిన బానోత్ రమేశ్. బైక్‌ను సగభాగం వరకు తొలగించి పానీపూరి డబ్బాను ఆల్ట్రేషన్ చేసి అందంగా ముస్తాబు చేసి పాలకుర్తి మండల కేంద్రంలో విక్రయిస్తున్నాడు. దీంతో ఈ మొబైల్ పానీపూరి బండిని చూసిన వినియోగదారులు ఆలోచన..అదుర్స్ అంటూ కొనియాడుతున్నారు. బైక్‌కు రూ. 80వేలకు కొనుగోలు హైదరాబాద్‌లో పానీపూరి డబ్బాను ఆల్ట్రేషన్ చేసినట్లు రమేశ్ తెలిపారు. కాగా, రమేశ్ పానీపూరిని ముందస్తుగానే వివాహ, శుభకార్యాలకు భోజన ప్రియులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.
బైక్‌కు పానీపూరి బండి ఏర్పాటు
ఆకట్టుకుంటున్న మొబైల్ పానీపూరి వాహనం

ఆలోచన అదుర్స్..