
ప్రభుత్వాలవి కార్మిక వ్యతిరేక విధానాలు
హన్మకొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరా డి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూల నాలుగు కోడ్‌లు తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. బుధవారం జరిగే సమ్మె కు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ మద్దతు ఇచ్చిందన్నారు. అయితే 10 పని గంటల విధానాన్ని తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 282 జారీ చేసిందని దుయ్యబట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సారంగపాణి, ఐఎఫ్ టీయూ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు, టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ, మున్సిపల్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకుడు ధర్మరాజు మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఏకశిల పార్కు నుంచి సుబేదారిలోని కలెక్టరేట్ వరకు ర్యాలీ తీయనున్నట్లు తెలిపారు. టీఎస్ టీయూసీ నా యకుడు శ్యాం, మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ, బీఆర్‌టీయూ నాయకుడు నాయిని రవి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
దాస్యం వినయ్ భాస్కర్