
జ్వరంతో బాలుడి మృతి
కేసముద్రం: జ్వరంతో ఓ బాలుడి మృతి చెందాడు. ఈ ఘటన ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండాజీపీ శివారు బావోజీతండాలో చోటు చేసుకుంది. ఎస్సై మురళీధర్‌రాజు కథనం ప్రకారం..తండాకు చెందిన ధారావత్ బాలాజీ, అనిత దంపతుల పెద్దకుమారుడు చరణ్‌సింగ్(15) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా, వారం క్రితం జ్వరం రావడంతో ఇంటికి తీసుకొచ్చారు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఆ బాలుడికి జ్వరంతోపాటు కడుపునొప్పి రావడంతో కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. సదరు వైద్యుడు ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా, ఇంజక్షన్ వికటించడంతోనే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మురళీధర్‌రాజు తెలిపారు.
● ఇంజక్షన్ వికటించడంతోనే మృతి
చెందాడని పోలీసులకు ఫిర్యాదు