
ప్రాణహిత పరవళ్లు..
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం వరద ప్రవాహం పెరగడంతో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం సరస్వతీఘాట్ వద్ద మెట్లను తాకుతూ 6.600 మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదై దిగువకు కాళేశ్వరం మీదుగా తరలింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి రెండు రోజుల నుంచి వరద తాకిడి పెరుగుతోంది. 1.33లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతుండగా..బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నారు. బుధవారం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇంజనీరింగ్ అఽధికారులు పేర్కొంటున్నారు.
కాళేశ్వరం వద్ద
6.600 మీటర్ల ఎత్తులో నీటిమట్టం
1.33 లక్షల క్యూసెక్కుల
నీరు విడుదల