రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ కనులపండువగా కేయూ స్నాతకోత్సవం
విలువలు,
నైపుణ్యాలు
కేయూ క్యాంపస్: విలువలు, నైపుణ్యాలు రెండు అవసరమేనని, వృత్తిపర విజయానికి విలువలతో కూ డిన జీవితంపై విద్యార్థులు దృష్టిసారించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కేయూ 23వ స్నాతకోత్సవంలో గవర్నర్.. చాన్స్‌లర్‌గా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం మాటలను గుర్తుచేస్తూ విజ యం కోసం కష్టాలు అవసరం అన్నారు. వైఫల్యాలకు భయపడకుండా దానిలోని విజయం కోసం బీ జాలు పండించాలన్నారు. మనిషి జీవితంలో ఇబ్బందులు వస్తుంటాయన్నారు. ఎందుకంటే ఆ విజయాన్ని ఆస్వాదించేందుకు ఇబ్బందులు అవసరమన్నారు. వైఫ్యలానికి భయపడొద్దన్నారు. వైఫల్యాన్ని ఆలింగనం చేసుకోండి.. దానినుంచి నేర్చుకోండి.. ప్రతి అడ్డంకికి మీ మెట్టు మారనివ్వండి అన్నారు. 21వ శతాబ్దానికి నైపుణ్యాలు అవసరమన్నారు. వి మర్శనాత్మక ఆలోచనలు, సృజనాత్మకత, సహకారం ఉత్పుకత, కమ్యూనికేషన్ వంటి ఐదు ‘సీ’లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యువత విజయానికి అవే మార్గదర్శకాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ యాభై సంవత్సరాల క్రితం స్థాపించినప్పుడు ఇది ఉత్తర తెలంగాణకు ఉన్నత విద్యలో రూపాంతర ప్రయాణానికి నాందిపలికిందన్నారు. 672 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. 27 విభాగాలతో 500కుపైగా కళాశాలలను కలిగి ఉందన్నారు. విశ్వవిద్యాలయం విస్తృత విద్యావ్యవస్థగా ఎదిగిందన్నా రు. 2023 కేయూ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించిందన్నారు. 2024లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో 151–200 ర్యాంకు సాధించిందన్నారు. ఫార్మాస్యూ టికల్ సైన్సెస్ కా లేజీ జాతీయస్థాయిలో 84వ స్థానంలో ఉందన్నారు. ఈ విజయాలు పరిమిత వనరుల మధ్య విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు కృషికి ఫలితమన్నారు. డీఎస్‌టీ, సీఎస్‌ఐఆర్, ఐసీఎంఆర్, యూ జీసీ, ఐసీఎస్‌ఆర్ ఏజెన్సీల మద్దతు కూడా గుర్తుచేశారు. మీ స్వప్నాల వేటకు ఇది మేల్కోనే క్షణమన్నారు. మీరు కేవలం డిగ్రీలు పొందలేదని ఒక బాధ్యత, ఆశయాన్ని దేశాభివృద్ధిలో భాగస్వామిగా మారే అవకాశాన్ని స్వీకరించారన్నారు. కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం విద్య, వికాసం, ఆశ, నూతన ఆరంభాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. కేరీర్‌లోనే కాకుండా భవిష్యత్‌లో ఇంకా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రారంభంలో పీహెచ్‌డీ పట్టభద్రులకు, గోల్డ్‌మెడల్స్ సాధించిన వారికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అభినందనలు తెలిపారు.
మీడియం అవరోధం కాదు..
ప్రశ్నలడగడం నేర్చుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి విద్యార్థుల శక్తిని ఉపయోగించాలన్నా రు. భాషామాధ్యమం మన అభివృద్ధికి అవరోధం కాదని, విజేతలుగా విద్యార్థులు నిలవడంలో తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితుల పాత్ర ను గుర్తుచేస్తూ విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రులు, గురువుల పాత్ర కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి తన సొంత జీవన ప్రయాణాన్ని పంచుకున్నారు. తనది నల్లగొండలో చిన్న గ్రామమన్నారు. తెలుగు మీడియంలో డిగ్రీ వరకు విద్యనభ్యసించి ఇంగ్లిష్‌తో పోరాడుతూ పేపర్ బాయ్‌గా పని చేసిన అనుభవాలను వివరించారు. తాను ఐఐసీటీ డైరెక్టర్‌గా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి విద్యార్థికి ‘మీ గతం కాదు, మీ లక్ష్యానికి మీరు చేసే ప్రయాణమే అసలైన నిర్వచనం’ అని సందేశమిచ్చారు.
కేయూ అభివృద్ధి పనులకు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి.. యూనివర్సిటీ విద్యాపరంగా, పరిశోధనపరంగా, అభివృద్ధి పరంగా ఎదుగుతున్న తీరు రిపోర్టు రూపంలో అందించారు. కేయూ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కలిగి ఉండి 50 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతోందని, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు కూడా నిర్వహించుకోబోతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కూడా తెలిపారు. స్నాతకోత్సవంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, డీన్లు గాదె సమ్మయ్య, బి.సురేశ్‌లాల్,జి. హనుమంతు, శ్రీనివాస్, సదానందం, కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, సెనెట్ సభ్యులు, మాజీ వీసీలు ఎన్. లింగమూర్తి, బి.వెంకటరత్నం, అంపశయ్య నవీన్, కేయూ పాలకమండలి సభ్యులు మల్లం నవీన్, సుకుమారి, అనితా రెడ్డి, బాలు చౌహాన్, సుదర్శన్, రమ, చిర్రరాజు, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్‌డీ అవార్డులు పొందని అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలు, వివిధ కోర్సుల్లో గోల్డ్‌మెడల్స్‌సాధించిన అభ్యర్థులకు గోల్డ్‌మెడల్స్‌ను రాష్ట్రగవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ.. శ్రీనివాస్‌రెడ్డి, వీసీ ప్రతాప్‌రెడ్డితో కలిసి ప్రదానం చేశారు.
గవర్నర్‌కు చేనేత జ్ఞాపిక అందజేత
న్యూశాయంపేట: వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ కలెక్టర్‌లో సోమవారం టీబీపై జరిగిన సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరయ్యారు. ఓరుగల్లు ప్రత్యేకత గుర్తుండేలా జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, కాకతీయ కళాతోరణం ప్రతిబింబించిన వరంగల్ చేనేత డర్రీ జ్ఞాపికను కలెక్టర్ సత్యశారద.. గవర్నర్‌కు అందజేశారు.
రెండూ అవసరమే
రెండూ అవసరమే
రెండూ అవసరమే