
వసూళ్ల పర్వం!
గార్ల: కొత్త రేషన్‌కార్డుల మంజూరు కోసం తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్ కార్డు ల కోసం వెళ్తే కార్యాలయ సిబ్బంది సర్వర్ బిజీగా ఉందని, సైట్ ఓపెన్ కావడం లేదని, తర్వాత రమ్మని తిప్పుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నా రు. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కావడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ సిబ్బందికి డబ్బులు ముట్టచెబితే మాత్రం కొత్త రేషన్‌కార్డులు వెంటనే మంజూరు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయం చుట్టూ తిరగలేక డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని లబ్ధిదారులు అంటున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ శారదను సాక్షి వివరణ కోరగా మా కార్యాలయంలో రేషన్‌కార్డుల మంజూ రు కోసం ఎవరి వద్దనుంచి డబ్బులు వసూలు చేయ డం లేదు. ఒకవేళ సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు
రూ.3 వేల వరకు వసూలు