
శ్రీశైలం మృతితో రోడ్డున పడిన కుటుంబం..
పాలకుర్తి టౌన్: విద్యుత్ శాఖ అన్‌మ్యాన్ కార్మికుడు బైకాని శ్రీశైలం మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన శ్రీశైలం గత సంవతరం ఏప్రిల్ 06న వల్మిడిలో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురైన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. శ్రీశైలం మృతి తర్వాత ప్రభుత్వం, విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో భార్య రాణి ఇద్దరు పిల్లలతో జీవన పోరాటం చేస్తోంది. తీగారం నుంచి తన తల్లిగారి ఊరు దేవరుప్పులకు వెళ్లి ఉంటుంది. కుటుంబ పోషణకు రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.
పిల్లల పోషణ ఇబ్బందిగా ఉంది..
నాతోపాటు నా పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నా భర్త విధి నిర్వహణలోనే ప్రాణం కోల్పోయాడు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం, విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి సాయం అందలేదు. పిల్లలను పోషించుకునేందుకు ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వాలి. అలాగే, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి

శ్రీశైలం మృతితో రోడ్డున పడిన కుటుంబం..