
మహనీయుల జీవితం అందరికీ ఆదర్శం
మహబూబాబాద్: మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా.. దొడ్డి కొమురయ్య, రోశయ్య చిత్రపటాలకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. సాయుధ పోరాట యోధుడు కొమురయ్య అన్నారు. కొటిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారన్నారు. మహనీ యులను ఒక కులానికో, వర్గానికో పరిమితం చేయకుండా వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, డీసీఓ వెంకటేశ్వర్లు, డీవీహెచ్‌ఓ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
టీబీపై విస్తృత ప్రచారం చేయాలి..
టీబీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతో టీబీ నివారణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. క్షయ వ్యాధిని 2030 వరకు నివారించాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని 171 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల ద్వారా రెండు టీంలు తెమడ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీసీలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, డీఈఓ రవీందర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ జిల్లా సంక్షేమాధికారి శిరీష సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్