
ప్రతీ ఏడాది మొదటిస్థానంలో ఉండాలి
మహబూబాబాద్ రూరల్ : పది ఫలితాల్లో ప్రతీ ఏడాది జిల్లా మొదటిస్థానంలో ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ ఆకాంక్షించారు. ఈ ఏడాది పది ఫలితాల్లో రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిల్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో డీఈఓ రవీందర్ రెడ్డి, ఎంఈఓలతో శుక్రవారం ఎమ్మెల్యే మురళీనాయక్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పది ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి 99.29 శాతంతో జిల్లాను మొదటి స్థానంలో నిలపడంతో అధికారులను అభినందించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఫలితాలు వెలువడే విధంగా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యలో పెంచేలా విద్యార్థులను తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో సదుపాయాల విషయంలో సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్